సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాండురంగ ఆశ్రమంలో గురువారం అత్యంత వైభవోపేతంగా 93వ ఆశాడి ఉత్సవాలు ముగిశాయి. నూతనంగా నిర్మించిన సాద మండపంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. హరే రామ నామ సంకీర్ణంతో ఆశ్రమం ప్రాంగణం మారుమోగింది. రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం అని ఆశ్రమ పురోహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదునూరి వెంకటరమణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.