సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆర్టీవో కార్యాలయం ఏర్పాటుకై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాజీవ్ చౌరస్తాలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టిఓ కార్యాలయం ఏర్పడితే వెనుకబడిన ప్రాంతంలో కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు వారు తెలియజేశారు. అందులో భాగంగా నేడు సంతకాల సేకరణ కార్యక్రమంలో యువకులు ఆటో డ్రైవర్లు భారీ ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.