హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువ శాతం రైతులు సన్న రకం వరి పంటను సాగు చేశారు. సన్న రకం వడ్లకు ప్రభుత్వం మద్దతు ధర రూ. 2320 ఉంది దీనికి తోడు ప్రభుత్వం సన్నాలకు రూ. 500 లు బోనస్ ప్రకటించింది. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకెళ్తే తేమ శాతం పేరుతో ఇబ్బంది పెట్టి రోజులు గడుపుతున్నారు. దీంతో రైతులు వేచి చూడలేక రూ. 100 లు తక్కువైన, ప్రైవేట్ మిల్లులకు అమ్ముకుంటున్నారు.