హుస్నాబాద్: సదర్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది

64చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం కోహెడ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సింధూ నాగరికత నుంచి పశు సంపదను పూజిస్తున్న సంప్రదాయం మనదన్నారు. ప్రతి ఏటా యాదవులు మంచి జరగాలని సదర్ ఉత్సవంలో దున్నను పూజిస్తూ కార్యక్రమం చేపట్టడం సంతోషమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్