హుస్నాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న బెజ్జంకి బ్రాంచ్ గురుకుల హాస్టల్ ను జాతీయ మానవ హక్కుల మండలి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పెందోట భూశంకరాచారి శనివారం సందర్శించి, విద్యార్థులు మరియు హాస్టల్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో చదువు, భోజన సదుపాయం, మెడికల్ గురించి చర్చించారు. హాస్టల్ నిర్వహణ, చదువులో ఏ మాత్రం పొరపాట్లు జరగకూడదని వారు వివరించారు.