సిద్ధిపేట జిల్లా కోహెడ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కోహెడ మండల బిజెపి అధ్యక్షుడు జాలిగాం రమేష్ గనేతృత్వంలో జరిగిన జయంతి వేడుకల్లో స్వామి వివేకానంద చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోహెడ మండల బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.