చెరువులో మహిళ మృతదేహం కలకలం

4711చూసినవారు
చెరువులో మహిళ మృతదేహం కలకలం
మెదక్ రూరల్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కోంటూర్ చెరువులో శుక్రవారం లభ్యమైంది. చెరువు సమీపం నుంచి ఓ వ్యక్తి వెళ్తుండగా మృతదేహం కనిపించడంతో పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెదక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహిళలు ఎవరైనా అదృశ్యం అయితే వారిని సంప్రదించాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్