కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శనివారం తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇమాంపూర్ సమీపంలో ఓబైక్ను కారు ఢీకొనింది. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.