మైనంపల్లి బెదిరింపులకు ఎవరు భయపడేదే లేదని బిఆర్ఎస్ యువజన, విద్యార్థి నాయకులు నిమ్మ రజనీకాంత్ రెడ్డి, పెర్క బాబు మండిపడ్డారు. కౌన్సిలర్ బ్రహ్మం మైనంపల్లిపై చేసిన వ్యాఖ్యలకు భయపడి తన అనుచరులతో ఫోన్లలో బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారన్నారు. కేసులు పెడతామని.. నీ అనుచరులతో ఫోన్లు చేపించి నీ అంతు చూస్తామని, నిన్ను చంపుతాను అని బెదిరించడాన్ని ఖండించారు.