అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
రాయ పోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంగ స్వామి ఇంటి నిర్మాణానికి, ఆటో రిక్షా కొనుగోలుకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక రెండు నెలల క్రితం ఆటో రిక్షాను అమ్మేశాడు. అప్పుల బాధ తగ్గకపోవడంతో 28న అర్ధరాత్రి గడ్డి మందు తాగడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందినట్లు భార్య కల్పన ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.