ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం.