రాజన్న జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఐల. శివరామ్ నీ బోయిన్ పల్లీ మండల మున్నూరు కాపు కన్వీనర్ గా నియమిస్తూ శుక్రవారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ వనమాల ప్రవీణ్ కుమార్ పటేల్ ప్రకటించారు. ఈ సందర్భంగా శివరామ్ మాట్లాడుతూ.... నాకు ఈ బాధ్యత ఇచ్చిన ప్రవీణ్ పటేల్, సంజీవ్ పటేల్, మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుపతి పటేల్, రాజేష్ పటేల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్నూరు కాపు కార్పొరేషన్ దిశగా పోరాడుతామని, మండలంలోని అన్ని గ్రామాలలో కాపు సంఘం నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.