రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మల్లాపూర్ లో కరోనా ప్రభావంతో స్కూల్ లేకపోవడంతో తాతతో కలిసి మనువడు పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇలా తాతతో దుక్కిదున్నుతూ దున్నుతున్న మనువడు జేశ్వాంత్ రెడ్డీ. ఈ సందర్భముగా అతడి తాత మాట్లాడుతూ.. అతడి మనువడు రోజు తనతో పొలానికి వస్తాడని వారి ఇంటి నుంచి పొలం దగ్గరికి రావడానికి 1కిమీ దూరం ఉంటుందని అయినా కూడా అతడి మనువడు తనతో నడుచుకుంటూ వస్తాడని రైతు దూది రఘుపతి రెడ్డి తెలిపారు. మనువడితో కలిసి ఇలా పని చేయడం ఆనందంగా ఉంది అంటూ హర్షం వ్యక్తం చేసారు.