గంగాధర నుండి కరీంనగర్ వెళ్ళే ప్రధాన రహదారి పై మంగళవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్డు పై చెట్టు కొమ్మలు మరియు భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. దీని వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. మరియు విద్యుత్ వైర్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వలన ద్విచక్ర వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.