ప్రతి ఇల్లు, గ్రామం, పట్టణం స్వచ్చంగా పచ్చగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో కార్యక్రమాన్ని ప్రారంభించారు.