ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలమార్చుకోవాలి

154చూసినవారు
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలమార్చుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని శ్రీమాన్‌ నంబి వేణుగోపాలాచార్య కౌశిక చార్య అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సత్సాంగ్ 14 వార్షికోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొని, సుందరకాండ పారాయణ గ్రంధం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీమాన్‌ నంబి వేణుగోపాలాచార్య కౌశిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలమార్చుకోవాలని ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని శ్రీమాన్‌ నంబి వేణుగోపాలాచార్య కౌశిక అన్నారు.

శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంట్లో పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించే బాధ్యత తల్లిదండ్రులపై మనందరిపై ఉందని, ఏకాగ్రత ద్వారా జీవిత ప్రశాంతత లభిస్తుందన్నారు. ఏకాగ్రత ఉండడానికి చెడును వీడనాడి మంచి మార్గంలో నడవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా నడవడం ద్వారా ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా జీవనం గడిపే అవకాశం ఉందన్నారు.

తప్పును సరిదిద్దుకోవడానికి ధ్యానం చేయాలన్నారు. తన ఆత్మను వశపర్చుకోవడం ధ్యానం మార్గంను అనుసరించాల్సిన మార్గం ఎంతైనా ఉందన్నారు. అందరికి యోగం అబ్బేది ధ్యానం ద్వారానే తోడ్పడుతుందన్నారు. విశ్వకర్మయోగం ద్వారా ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు భక్తిమార్గంలో నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రమ్మశ్రీ తిగ్గుళ్ల విష్ణు శర్మ మాట్లాడుతూ ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

మార్కండేయ ఆలయం విశిష్టత గురించి భక్తులకు తెలిపారు. అనంతరం సుందర కాండ పారాయణ గ్రంధాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. అనంతరం సత్సాంగ్ సభ్యులకు సుందర కాండ గ్రంధం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్‌ నంబి వేణుగోపాలాచార్య కౌశిక, బ్రమ్మశ్రీ తిగ్గుళ్ల విష్ణు శర్మ, మెడిపల్లి శ్రీనివాస్ శర్మ, కొండగట్టు దేవాలయం అర్చకులు మారుతి శర్మ, శ్రీ భక్త మార్కండేయ దేవాలయం సత్సాంగ్ నిర్వాహకులు ఆకుబత్తిని శ్రీనివాస్, పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షుడు సిరిపురం రాజలింగం, ప్రధాన కార్యదర్శి భోగ గంగాధర్, డైరెక్టర్లు, వనమాల సహదేవ్ భాగ్య లక్ష్మీ, గుండేటి స్వరాజ్య లక్ష్మీ, ఆడెపు సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్ పెల్లి సుధాకర్, గీతా సత్సంగ్ ట్రస్ట్ కార్యదర్శి పాoపట్టి రవిందర్, శ్రీ లక్ష్మీ గణేష్ మందిర కన్వీనర్ కోటగిరి శ్రావణ్, నవదుర్గ సేవా సమితి నిర్వాహకులు కస్తూరి శ్రీనివాస్, కొక్కుల సుదర్శన్, సంగీత శ్రీనివాస్, చిలుక శ్రీనివాస్, కొక్కుల గంగాధర్, కోర్టు శ్రీను, బుస గంగారాం, సిరిపురం జితేందర్, తాటిపాముల వినోద్, అనుమల్ల వెంకటేష్, ఆసం ఆంజనేయులు, జోగ మల్లేశం, చెన్న రమేష్, ఏ, ఎస్ వాసు, వనామల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్