జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుండి కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆదివారం తెల్లవారుజాము నుండి ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. రోడ్డుపై ప్రవహిస్తున్న వరదనీటీతో రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. జగిత్యాల పట్టణంలోని మెయిన్ రోడ్డు తో పాటు బైపాస్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. ఇళ్ల మధ్య ఉన్న లోతట్టు ఖాళీ స్థలాలు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి.