లాక్ డౌన్ నియమాలను పాటించాలి: ఎస్సై

2812చూసినవారు
లాక్ డౌన్ నియమాలను పాటించాలి: ఎస్సై
రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు ఉదయం 10గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజాము 6 గంటలకు లాక్ డౌన్ విధించినందున ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఎవ్వరు బయటికి రావద్దని ఎస్సై రఫిక్ ఖాన్ తెలిపారు. మండల కేంద్రంలో ఎస్సై రఫిక్ ఖాన్ పోలీస్ సిబ్బందితో కలసి లాక్ డౌన్ ను పర్యవేక్షించారు. మళ్ళీ ఉదయం 6 గ. నుంచి 10గంటల వరకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. తొలి రోజు మినహాయింపులో భాగంగా అప్రమత్తమైన జనాలు రోడ్ల మీదికి వచ్చి కావాల్సిన సరుకులు కొనుగోలు చేశారు. ముఖ్యంగా మద్యం షాపుల ముందు, కిరణం షాపులు, కూరగాయల మార్కెట్ ముందు జనం రద్దీగా కొనసాగింది. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నియమాలను పాటించాలని లేని యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్