జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయి రామ్ ఆ నదీ తీరంలో వెలసిన సాయిబాబా 104వ పుణ్యతిథి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం దసరా తరువాత వచ్చే మరుసటి రోజున సాయిబాబా యొక్క పుణ్యతిథి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం పూట కాకడ హారతి, ఆలయ సంకీర్తన అనంతరం స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. విశ్వ కళ్యాణం కోసం విశ్వ కళ్యాణ యజ్ఞం చేయడం కూడా జరిగింది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్నదానము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు, ప్రముఖులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.