ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమ్మక్కపేట క్రాసింగ్ వద్ద బైక్ అదుపు తప్పి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై అనిల్ శుక్రవారం తెలిపారు. మేడిపల్లిలో నివాసం ఉంటున్న రమేశ్ (39) పని నిమిత్తం మేడిపల్లి నుంచి మెట్పల్లి వైపు వస్తుండగా అమ్మక్కపేట క్రాసింగ్ వద్ద వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొని బండరాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.