జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో 23వ తేది సోమవారం రోజున అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా జరుగు కార్యక్రమాలు మరియు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల సరళి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుల కొత్త సుధీర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్త సుధీర్, జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త సురేష్, ఆర్యవైశ్య మహా సభ పీఆర్ఓ బట్టు హరికృష్ణ , సంఘ మాజీ అధ్యక్షులు చింత వెంకట రాములు, నీలి కాశీనాథం, కోటగిరి ప్రసాద్, మంచాల జగన్, అల్లాడి ప్రవీణ్, ఆర్యవైశ్య వివిధ వాడకట్టు సంఘాల అధ్యక్ష , కొత్త వాసు, నీలి శ్రీనివాస్, మోటూరి ప్రవీణ్ కుమార్, ఓజ్జల వెంకటరమణ, మానుక సత్యనారాయణమూర్తి, కోటగిరి రాజశేఖర్, ముక్క శ్యాంసుందర్, బుడికే శ్రీకాంత్, పొద్దుటూరి జలంధర్, పల్లెర్ల మహేందర్, మేడి కిషన్, ఎలిమి శంకర్, రేగొండ శిరీష్, రేగొండ మహేష్, సంఘ నాయకులు పాల్గొన్నారు.