ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో మానకొండూరు శాసన సభ్యులు రసమయి బాలకిషన్ పొట్టి తాటి మొక్కలను నాటారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సొంత ఖర్చులతో పొట్టి తాటి చెట్టు విత్తనాలను బీహార్ నుండి తెప్పించారు అని అన్నారు. మన దగ్గర చెట్లతో పోలిస్తే ఇవి చిన్నవిగా ఉండటం వల్ల గీత కార్మికులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు.