రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు

52చూసినవారు
రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు
శంకరపట్నం మండలం తాడికల్ పారా బాయిల్డ్ రైస్ మిల్లులో శనివారం రాత్రి సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాడికల్ లోని రాజరాజేశ్వర పారాబాయిల్డ్ లో సివిల్ సప్లై జగిత్యాల డిఎం ఆర్తిరాం ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈతనిఖీల్లో 680 క్వింటాల ధాన్యం తేడా వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డిటి సిఎస్ వేణుగోపాల్, ఏఎస్ఐ సుధాకర్, డిప్యూటీ తహసిల్దార్ బండి రమేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్