కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గురువారం ఉదయం మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తు రాసి ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డి త్రివేణి తిరుపతి రెడ్డి, యం పి టి సి చింతల రజిత లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల తిరుపతి రెడ్డి, నాయకులు చింతల లక్ష్మారెడ్డి, జనార్దన్ రెడ్డి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.