మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్‌ని వల్లంపట్ల రెడ్డి సంఘం సభ్యులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి
పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం భవనానికి రూ.10లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రసమయి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.