పీహెచ్సీని తనిఖీ చేసిన జిల్లా మలేరియా అధికారి

80చూసినవారు
పీహెచ్సీని తనిఖీ చేసిన జిల్లా మలేరియా అధికారి
శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా మలేరియా అధికారి డా. ఉమాశ్రీ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఇటీవల కాలంలో మండలంలో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయని క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. తాడికల్ గ్రామంలో జ్వర పీడితుల వద్ద శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపారు. డెంగ్యూ నివారణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మండల వైద్యాధికారి డా. గొట్టే శ్రావణ్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్