సహకార దినోత్సవ వేడుకలు

80చూసినవారు
సహకార దినోత్సవ వేడుకలు
కమాన్ పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ప్రపంచ సహకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ముందు పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిందం తిరుపతి, సభ్యులు గుండేటి శ్రీమూర్తి, అడ్వాల చంద్రయ్య, వైనాల రాజు, సీఈవో సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్