మంథని మున్సిపల్, 8వ వార్డ్ పోచమ్మవాడకు చెందిన వ్యక్తి కరోనాతో బాధపడుతూ మంగళవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న 8వ వార్డ్ కౌన్సిలర్ కొట్టె పద్మ రమేష్ మృతుని అంత్యక్రియల్లో పాల్గోని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు. వార్డు ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని తెలియజేశారు. కరోనాతో మరణించిన వ్యక్తులకు సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడమే వారికి మనమిచ్చే చివరి మర్యాద అని తెలిపారు.