పెద్దపల్లి: అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి: కలెక్టర్

58చూసినవారు
పెద్దపల్లి: అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి: కలెక్టర్
పట్టణాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పనితీరుపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాలలో రోడ్లపై చెత్త లేకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్