తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు కరోనా కట్టడికి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అందులో భాగంగా లాక్ డౌన్ సడలింపు సమయం దాటిన తర్వాత బయట తిరుగుతున్న ఆకతాయిలను మంథని సీఐ స్వయంగా వ్యాన్ లో ఎక్కించి సుల్తానాబాద్ కోవిడ్ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా ఎవరూ బయట తిరగొద్దని, కారణం లేకుండా ఎవరైనా బయట తిరుగుతూ పట్టుబడితే క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తామని 14 రోజుల తర్వాతే బయటకు వదలడం జరుగుతుందని తెలిపారు. కావున మంథని సర్కిల్ పరిధిలోని రామగిరి, ముత్తారం, మంథని మండలాల ప్రజలు కారణం లేకుండా ఎవరూ బయటకు రావద్దని మంథని సీఐ జీ. సతీష్ తెలిపారు.