సఖి కేంద్రం సేవలపై విస్తృత ప్రచారం: కలెక్టర్

52చూసినవారు
సఖి కేంద్రం సేవలపై విస్తృత ప్రచారం: కలెక్టర్
సఖి వన్ స్టాప్ కేంద్రాల ద్వారా అందించే సేవలపై మహిళలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సఖి కేంద్రంతోపాటు అంగన్వాడీ కేంద్రం, బాలల రక్ష భవన్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సిడిపిఓ కవిత, సఖి సెంటర్ కో ఆర్డినేటర్ స్వప్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్