పెద్దపల్లి జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా వరి నారు మడులపై రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు యాజమాన్య పద్ధతులు వివరించారు. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో రైతులకు క్షేత్ర స్థాయిలో నారుమడులు, యాజమాన్య సూచనలు అందించారు. వాతావరణ పరిస్థితుల్లో నారుమడులు ఎర్రబడడం కారణంగా వరి నారుమడులలో చలి తీవ్రతతోపాటు వివిధ పోషక లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించి నివారణ చర్యలను వివరించారు.