పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి మండల మహోత్సవ పడిపూజ బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల సాక్షిగా ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప దీక్షా పరులు పాల్గొన్నారు.