రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.