పెండింగ్ భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదేశించారు. శుక్రవారం ఎలిగేడు తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు, భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారీపై రివ్యూ నిర్వహించారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటారు. ఈ సమావేశంలో ఎలిగేడు మండల తహసిల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.