ఖనిలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

83చూసినవారు
ఖనిలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గోదావరిఖని ఏబీవీపీ నగర శాఖ కార్యదర్శి పిడుగు సిద్ధార్థ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా 76వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఎంతోమంది విద్యార్థులను జ్ఞాన శీల ఏకత సాధనలకై జాతీయ పునః నిర్మాణం కోసం పనిచేస్తున్న సంఘం ఎబివిపి అని అన్నారు. నాయకులు ఉదయ్, సందీప్, రవి, మహిళా కార్యకర్తలు భవాని, కావ్య, హిమబిందు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్