సింగరేణి దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం సెంటినరీ కాలనీ, 8 ఇంక్లైన్ కాలనీలో నివసిస్తున్న రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఉద్యోగుల గృహాలను ఉత్తమ పర్యావరణహిత గృహాల ఎంపిక కమిటీ సందర్శించింది. పోటీల కోసం ముందుగా నమోదు చేసుకున్న గృహాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ కన్వీనర్ రఘుపతి ఎంపిక చేయబడిన గృహాల ఉద్యోగులకు ఈనెల 23న సింగరేణి దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు.