శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వానికి అవకాశమివ్వొద్దని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో వార్షిక నేర సమీక్షను ఆన్‌లైన్ జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించారు. ప్రతి కేసులో డిసిపి, ఏసిపి, సిఐల స్థాయిలో రివ్యూ చేసి త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. మీటింగ్ లో పెద్దపల్లి డిసిపి చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు పాల్గొన్నారు.