పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది. చిట్ట చివరి సమావేశం కాగా కార్యక్రమంలో చర్చల అనంతరం మండల ప్రజాపరిషత్ సమావేశంలో వచ్చే నెల 4 తో మండల ఎంపీపీ, జడ్పీటిసి, ఎంపీటీసీల కాలం ముగియనుండడంతో వారిని పూలమాలలు, శాలువాలతో మండల ప్రజా పరిషత్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.