చందుర్తి: పోలీస్ అమరవీరులకు నివాళులు

68చూసినవారు
పోలీస్ అమరవీరుల సంస్మరణ లో భాగంగా పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపెట్ గ్రామ శివారులో గల అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ముఖ్య అతిధులుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. వారి సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్