వేములవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు

73చూసినవారు
వేములవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి వచ్చిందని జిల్లా అధికారులు తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 1000 గజాల స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు స్థల కేటాయింపు పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్