ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు గౌతమి, ఖీమ్యా నాయక్ లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి 54 దరఖాస్తులు, ఉపాధి కల్పనకు సంబంధించి 11 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.