బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసు కాదని సక్రమ కేసే అని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ గౌస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం కేటీఆర్ ను ముట్టుకుంటే అగ్నిగుండం చేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.