వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వేద పండితులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు. సోమవారం స్వామివారి కిష్టమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.