అక్రమ అరెస్టులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం (నేడు) సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ గ్రామంలో నేపథ్యంలో తమ సమస్యలు పెండింగ్ బిల్లుల గురించి వినతి పత్రం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిశామని అన్నారు. అవకాశం కల్పిస్తానని చెప్పి సర్పంచులను అరెస్టు చేయించడం బాధాకరమన్నారు.