కనువిందు చేస్తున్న అరకు మాడగడ మేఘాల కొండ (వీడియో)
AP: వైజాగ్‌లోని అరకులోయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి ఓకే ప్రకృతి రమణీయ ప్రదేశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కొండల మధ్య పాల కడలిని తలపించేలా మాడగడలో ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. భూతల స్వర్గాన్ని తలపించే మాడగడ మేఘాల కొండ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వెళ్తేనే ఈ అందాలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.