స్కూటీతో పాటు మోమోస్ షాప్‌లోకి దూసుకెళ్లిన మహిళ (వీడియో)
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లోని సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ వద్ద స్కూటర్ నడుపుతూ ఓ మహిళ ప్రమాదవశాత్తు మోమోస్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. దుకాణదారుడు విజ్ఞత ప్రదర్శించి వెంటనే గ్యాస్ సిలిండర్ స్విచ్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.