టాయిలెట్‌లో చాలాసేపు కూర్చోవడం చాలామందికి అలవాటు. అయితే టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మొలల వ్యాధి ముప్పు పెరుగుతుందని, కటి కండరాలు బలహీనంగా మారతాయని టెక్సాస్ యూనివర్సిటీ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ లైక్సూ వెల్లడించారు. టాయిలెట్ కు వెళ్లినప్పుడు ఎక్కువ ఒత్తిడి చేయకూడాని పేర్కొన్నారు.