రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తాం: తుమ్మల

61చూసినవారు
రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తాం: తుమ్మల
తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సన్న వడ్లకే బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై మంత్రి స్పందించారు. పేదలు సన్నబియ్యం తినాలని సంకల్పించామన్నారు. అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాకు రూ.500 బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్తులో దొడ్డు వడ్లకూ దీన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్