ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు: సీఈఓ

80చూసినవారు
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు: సీఈఓ
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా హెచ్చరించారు. రోగులకు సేవలు ఆగకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. కాగా ఆరోగ్యశ్రీ సీఈఓతో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు రెండు సార్లు చర్చలు జరపగా విఫలమయ్యాయి. పెండింగ్ బిల్లులు చెల్లించడానికి నిరాకరించడంతో యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్